ప్రజాధారణ కోల్పోతున్న పరకాల ఎమ్మెల్యే
తాజా సర్వే తెలిపిన నివేదిక ప్రకారం అత్యంత ప్రజాధారణ కోల్పోతున్న MLA ల లిస్టులో పరకాల MLA చల్లా ధర్మారెడ్డి గారు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. ప్రజాసంక్షేమ పథకాలు , సర్పంచుల ప్రాధాన్యత, గ్రామాభివృద్ధి అనే మూడు విషయాల పట్ల సర్వే నిర్వహించగా , ప్రజాసంక్షేమ పథకాలు కేవలం TRS కార్యకర్తలకు మాత్రమే చెందినట్లు తెలిసింది ఈ విషయం పట్ల ప్రజలు ప్రశ్నిస్తే మీది TRS పార్టీ కాదు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు మాత్రమే ముందు ప్రాధాన్యత అని చెప్పుకొచ్చినట్లు సమాచారం. అలాగే సర్పంచుల ప్రాధాన్యత విషయానికి వస్తే తన సన్నిహితులు, తన చెప్పుచేతల్లో ఉన్నవారికి మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గ్రామాభివృద్ధిలో భాగమైన రోడ్లు, కాలువలు ఇతర పనులను ఎక్కువగా కేటాయిస్తున్నట్లు సమాచారం అందింది. ఇక కరోన ఫస్ట్ వేవ్ ముందే వచ్చిన 750 డబుల్ బెడ్రూంలు ఇప్పటివరకు కేటాయించకపోవడం గమార్హం. ఇక ప్రాజానాడి ఎలా ఉందో ప్రశ్నిచగా కొన్ని గ్రామాలకు MLA గా గెలిచినప్పటినుండి ఒకటి రెండు సార్లకు మించి రాలేదని వాపోయారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు, కేవలం TRS కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని, నిరుపేదలకు పట్టించుకున్న పాపానపోలేదని కనీసం ఎవరికి అందుతుందని ఆరాకూడా తీయడం లేదని చెప్పుకొచ్చారు.
కొసమెరుపు:
ప్రతిపక్ష పార్టీల ముందుచూపు లోపం, దూకుడు లేకపోవడం TRS పార్టీకి కలిసొస్తుందని ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ పార్టీ దూకుడు పెంచితే TRS పార్టీకి ఓటమి తప్పదు అన్నట్లుగా చెప్పారు. లబ్ది పొంది పేదలపట్ల అనుచితంగా ప్రవర్తించిన కార్యకర్తలు ఈ సారి ఓటు అడగడానికి వస్తే తగిన బుద్ధి చెబుతాం అని చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment