భాగ్యనగరిపై కశ్మీర్ ఎఫెక్ట్.. సున్నిత ప్రాంతాల్లో హైఅలర్ట్

ఆర్టికల్ 370 రద్దుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసింది. సున్నిత ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. దీంతో తెలంగాణలోనూ హై అలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచారు. పాత బస్తీలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. సంఘ విద్రోహక శక్తు కదలికలపై నిఘా పెట్టడం కోసం పికెట్స్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కశ్మీర్‌‌ను రెండుగా విభజించడం పట్ల టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత స్పందించారు. కశ్మీర్ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాక్షించారు. కశ్మీరాన శాంతిసామరస్యాలు వర్థిల్లాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33bNnI3

Post a Comment

0 Comments