భార్యసహా ఇద్దరు పిల్లలను చంపిన భర్త

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడై భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలను అత్యంత కర్కశంగా హతమార్చాడు. పోaలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మోతీబాగ్ కాలనీకి చెందిన ప్రవీణ్ తన భార్య చాందిని (30), కుమారుడు అయాన్ (10), కుమార్తె ఏంజిల్‌(5) తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే, కొంతకాలంగా ప్రవీణ్ తన భార్య చాందినిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి భార్యపై కోపంతో ఆమెతోపాటు, తన ఇద్దరి పిల్లలపై ఇనుప రాడ్‌తో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ముగ్గురి తలలపై బలంగా కొట్టడంతో వారు అక్కడిక్కడే మరణించారు. హత్య చేసిన తర్వాత ప్రవీణ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MCZY12

Post a Comment

0 Comments