తిరుపతిలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ హత్యకు దారి తీసింది. కాలేజీలో గొడవలతో ఓ డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్య చేయడం కలకలంరేపింది. తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో ద్వారకనాథ్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. అతడ్ని శెట్టిపల్లి రైల్వే గేటు దగ్గరకు పిలిపించి.. బీరు బాటిల్‌తో దాడి చేసి.. కత్తులతో మెడపై పొడిచి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీలో తోటి విద్యార్థుల్ని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల మధ్య గ్రూప్ తగదాలతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మృతుడు కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ద్వారకనాథ్‌గా గుర్తించారు. అతడి తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటుండగా.. ఏడాదిన్నర క్రితం డిగ్రీ చదివేందుకు వచ్చాడు. శెట్టిపల్లిలో రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా.. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YDUp99
0 Comments