ఏపీ సీఎం కుటుంబ సమేతంగా జెరూసలెం పర్యటనకు వెళ్లారు. నాలుగు రోజులపాటు ఆయన అక్కడ గడపనున్నారు. ఎన్నికలు ముగిశాక విదేశాలకు వెళ్లి సేదతీరి వచ్చిన జగన్.. సీఎం అయ్యాక తొలిసారి ఫారిన్ టూర్‌కెళ్లారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కుటుంబ సమేతంగా వెళ్లొచ్చారు. ఇజ్రాయెల్‌లో జగన్ సరికొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ప్యాంట్, చొక్కా ధరించి మనలో ఒకడిగా ఉండే జగన్.. విదేశాల్లో కొంచెం స్టయిల్ మార్చారు. చక్కగా ఇన్‌షర్ట్ చేసి, ఫార్మల్ షూతో స్టయిలిష్‌గా సీఎం జగన్ కనిపిస్తున్నారు. ‘భరత్ అనే నేను’లో మహేశ్ బాబు లుక్‌ను సీఎం జగన్ గుర్తు తెస్తున్నారు. సీఎం స్టయిలిష్ లుక్ చూసి ఆయన అభిమానులు ముచ్చట పడుతున్నారు. ఆగష్టు 5న ఏపీ తిరిగి రానున్న జగన్.. ఆగష్టు 17న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి జీవించి ఉన్నంత వరకు పంచె కట్టులోనే కనిపించారు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆయన ప్యాంట్, షర్ట్ ధరించి పైన కోటు వేసుకునేవారు. వైఎస్ మోడ్రన్ లుక్ అప్పట్లో అందరినీ ఆకర్షించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KayrT4
0 Comments