లిఫ్ట్‌లోనే అత్యాచారయత్నం.. చెప్పుతో కొట్టి తప్పించుకున్న బాధితురాలు

తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడి బారి నుంచి చాకచక్యంగా తప్పించుకుందో 14ఏళ్ల బాలిక. లిఫ్ట్‌లో దుస్తులు విప్పేసి అఘాయిత్యానికి పాల్పడుతున్న వ్యక్తిని చెప్పుతో చితకబాదింది. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛండీఘడ్‌లోని జీరక్‌పూర్‌లో గల మోతియా రాయల్ సిటీ సొసైటీలో ఓ ఫ్లాట్‌లో 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. శుక్రవారం తన ఫ్లాట్ నుంచి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్‌ కోసం వేచిచూస్తున్న బాలికపై నవీన్ అనే కన్నేశాడు. లిఫ్ట్ ఓపెన్ కాగానే బాలికతో పాటు అతడూ లోనికి వెళ్లాడు. అందులో ఎవరూ లేకపోవడంతో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె దుస్తులు సగం దుస్తులు చింపేశాడు. లిఫ్ట్‌ను తాను నివసించే ఫ్లోర్‌లో ఆపేసి ఆమెను తన గదికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో చురుగ్గా స్పందించన బాలిక తన చెప్పులతో అతడిని తీవ్రంగా కొట్టి వెనక్కి నెట్టేసింది. అర్ధనగ్నంగానే తన ఫ్లాట్‌కు వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నవీన్ 15రోజులుగా తన వెంట పడుతున్నాడని, ఇప్పుడేమో లిఫ్ట్‌లో రేప్ చేసేందుకు యత్నించాడని చెప్పడంతో వారు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ljf6hP

Post a Comment

0 Comments