దేశంలో మహిళలకే కాదు మగాళ్లకు కూడా రక్షణ లేకుండా పోతోందనడానికి తాజా ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 36ఏళ్ల వ్యక్తిపై దుండగులు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సిగరెట్ కావాలని అడిగిన కొందరు వ్యక్తులు అతడిని నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: నవీ ముంబయిలోని వసీ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సాగర్ విహార్ లేక్ వద్ద ఐదుగురు వ్యక్తులు అతడిని ఆపి సిగరెట్ ఉందా? అని అడిగి మాటల్లో దించారు. కొద్ది నిమిషాల్లోనే అతడి నిర్బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాధితుడు కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ వేసి మలద్వారం ద్వారా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అక్కడ కొబ్బరిచిప్పను దూర్చి చిత్రహింసలు పెట్టారు. పురుషాంగాన్ని పంటితో కొరికి గాయం చేశారు. అనంతరం బాధితుడిని అక్కడే వదిలేసి పారిపోయారు. Also Read: గురువారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు బాధితుడిని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాధితుడికి సర్జరీ చేసి మలద్వారం నుంచి కొబ్బరిచిప్పను తీశారు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన యువకులే ఈ పైశాచికానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన ముంబయిలో కలకలం రేపుతోంది. మహానగరంలో మహిళలకే కాదు మగాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2n2ZGFX
0 Comments