పెళ్లికి నో చెప్పిందని వేశ్యను ముక్కలుగా నరికి చంపాడు

తనతో పెళ్లికి నో చెప్పిందన్న ఆక్రోశంతో వేశ్యను గొంతుకోసి దారుణంగా చంపేశాడో మానవ మృగం. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నింపింది. ఢిల్లీలో నివసించే మహ్మద్ ఆయూబ్‌ అనే వ్యక్తి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. చెడు తిరుగుళ్లు తిరిగే ఆయూబ్ కొన్నాళ్ల క్రితం లైంగిక సుఖం కోసం ఓ వేశ్య దగ్గరికి వెళ్లాడు. Also Read: వేశ్య అందానికి ముగ్ధడైన ఆయూబ్ ఆమెకు రెగ్యులర్ కస్టమర్‌గా మారిపోయాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని కోరగా ఆమె తిరస్కరించింది. ఎన్నిసార్లు కోరినా వేశ్య పెళ్లికి నిరాకరిస్తుండటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె అందం పూర్తిగా తనకే సొంతం కావాలని, మరొకరికి దక్కకూడదన్న దురాలోచనతో వేశ్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. Also Read: ఆగస్టు 20వ తేదీన వేశ్యతో బయటకు వెళ్లిన ఆయూబ్ ఆమెతో ఏకాంతంగా గడిపాడు. తర్వాత మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె నిరాకరించింది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసేశాడు. ప్రాణం పోయాక శరీరాన్ని ముక్కలుగా కట్‌చేసి ప్లాస్టిక్ సంచిలో మురికి కాలువలో పడేశాడు. మరుసటి రోజు డ్రైనేజీలో మానవ అవయవాలను చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని వాటన్నింటినీ సేకరించి పోస్టుమార్టానికి తరలించారు. తమకు లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు చేసి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆయూబ్ నేరం అంగీకరించడంతో అతడిని రిమాండ్‌కు తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2khE9Is

Post a Comment

0 Comments