Fact Check: అంబానీ, అదాలనీలకు భూమి కట్టబెట్టేందుకు గుజరాత్‌లో ఆలయాలు కూల్చేశారా?

విషయం : గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లాభాన్ని చేకూర్చేందుకే ఏమాత్రం వెనుకాడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అంబానీ, అదానీలకు భూమి కట్టబెట్టడానికి గుజరాత్‌లో 50 దేవాలయాలను బీజీపీ ప్రభుత్వం కూల్చివేసిందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన ఓ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. నిజం: గుజరాత్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 2008లో కొన్ని ఆలయాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. కూల్చివేత సమయంలో హిందూ ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరిశీలన: Modi Demolition Drive అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే గతంలో ఎన్డీటీవీ పోస్ట్ చేసిన వీడియో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే వీడియో వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోను పరిశీలిస్తే.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన మోదీ సర్కారు పర్మిషన్ లేకుండా నిర్మించిన ఆలయాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుందని యాంకర్ చదివారు. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే వీడియోను క్రాప్ చేసి కొన్ని ఫేస్ బుక్ పేజీలలో ఇటీవల పోస్ట్ చేశారు. నిర్ధారణ: అంబానీ, అదానీలకు భూమి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆలయాలను కూల్చివేయలేదని టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించి, వివరాలు వెల్లడించింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన భవనాలు, చేపట్టగా హిందూ ధార్మిక సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పటి మోదీ సర్కారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2n3Fcgr

Post a Comment

0 Comments