వివాహేతర సంబంధం.. కత్తులు, కర్రలతో దాడి చేసి..

అనుమానంతో ఓ వ్యక్తిని కర్రలు, కత్తులతో దాడి చేసి చంపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పట్టణం బాపూజీనగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన పరుమాండ్ల రామనాథం బతుకుదెరువు కోసం 12 సంవత్సరాల క్రితం కాజీపేట పట్టణానికి కుటుంబంతో వచ్చి పరుపులు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. చిన్నకోడెపాకకే చెందిన పరుమాండ్ల భిక్షపతి (45) భార్య కొద్దికాలం క్రితం మరణించడంతో హన్మకొండకు వచ్చి ఓ హోటల్‌లో పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. Also Read: ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో భిక్షపతి తరచూ రామనాథం ఇంటికి వస్తుండేవాడు. అయితే వివాహేతర సంబంధం అనుమానాల వల్ల తమ ఇంటికి రావడం మానుకోవాలని రామనాథం కుటుంబం భిక్షపతిని పలుమార్లు హెచ్చరించింది. అయినా భిక్షపతి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రామనాథం కుటుంబంలో కలహాలు పెరగడంతో అతను ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి రామనాథం ఇంటికి వచ్చిన భిక్షపతిని అతని కుటుంబ సభ్యులు బంధించి కర్రలు, కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన భిక్షపతి స్పృహ తప్పి పడిపోయాడు. Also Read: రామనాథం కుటుంబం వెంటనే 100 నంబర్‌కు డయల్‌ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే భిక్షపతి భవనం పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా స్పృహలోకి వచ్చిన భిక్షపతి తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Mmi7PM

Post a Comment

0 Comments