పెళ్లయిన 16 రోజులకే ఫ్యాన్‌కు వేలాడిన యువతి.. హత్యే అంటున్న తల్లిదండ్రులు

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన యువతి 16రోజులకే చేసుకుంది. ఉడు మలైపే విలామరత్తుపట్టి ప్రాంతానికి చెందిన షణ్ముగ వేల్‌, జీవరత్నం దంపతుల కుమారుడు రఘుపతి (32) ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. Also Read: జనవరి 30న అతడికి పొల్లాచ్చి సమీపంలోని జమీన్‌ ఊత్తుకుళికి చెందిన రామసామి అనే కొబ్బరి వ్యాపారి కుమార్తె దీప(18)తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి కాపురానికి వెళ్లిన దీప ఈ నెల 16వ తేదీన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫ్యాన్‌కు వేలాడుతున్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. Also Read: ఆత్మహత్య కాదు హత్యే: దీప తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తన ఇష్టప్రకారమే పెళ్లి చేస్తే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందని దీప తల్లిదండ్రులు అంటున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని అత్తింటి వారే ఆమెను చంపేసి ఉరేసుకున్నట్లు నాటకమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీప వేలాడుతున్నప్పుడు ఆమె పాదాలు నేలకు తాకే ఉన్నాయని, అందుకే అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. పెళ్ళి సందర్భంగా దీపకు అత్తింటి వారే నగలు కొనిచ్చారని, ఆత్మహత్యకు ముందురోజు కూడా ఫోన్ చేసి సంతోషంగా ఉన్నానని చెప్పిందంటున్నారు. అయితే మరుసటి రోజూ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని వారు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SD0JtA

Post a Comment

0 Comments