మెకానిక్‌తో అఫైర్.. టిక్‌టాక్‌‌లో వీడియోలు.. పరువు తీస్తోందని భార్యను చంపేసిన భర్త

టిక్‌టాక్‌ యాప్‌లో వీడియోలు చేస్తున్న వివాహిత కట్టుకున్న భర్త చేతిలోనే దారుణహత్యకు గురైంది. ఈ ఘటన తమిళనాడులోని కడూలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియూర్‌ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కుమరవేల్, నైవేలి దిడీర్‌కుప్పానికి చెందిన రాజేశ్వరి(26)ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. Also Read: ఇటీవల యాప్‌కు బానిసైన రాజేశ్వరి భర్త, పిల్లలను పట్టించుకోకుండా అదే జీవితంగా జీవిస్తోంది. మంచిగా రెడీ అయి వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోంది. ఆ యాప్‌లో పరిచయమైన యువకులతో డబుల్‌మీనింగ్ డైలాగులు చెబుతూ వీడియోలు తీయడం, అసభ్యంగా డ్యాన్సులు చేయడం కుమరవేల్‌కి నచ్చలేదు. ఇలాంటి వీడియోలు తీస్తూ భార్య కుటుంబ పరువు తీస్తోందని ఆవేదన చెందేవాడు. దీనికి తోడు స్థానికంగా మెకానిక్‌గా పనిచేసే ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించేవాడు. ఇవన్నీ వదిలి సంసారాన్ని పట్టించుకోవాలని కోరినా ఆమె పట్టించుకోలేదు. Also Read: దీంతో రెచ్చిపోయిన కుమరవేల్ ఆదివారం భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేసి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బన్రూట్టి బస్టాండ్ వద్ద తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన భార్య మెకానిక్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, దీంతోపాటు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ కుటుంబ పరువు తీస్తోందన్న కారణంతోనే చంపేసినట్లు నేరం అంగీకరించాడు. తల్లి హత్య, తండ్రి జైలుకి వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2v0vY8K

Post a Comment

0 Comments