గజ్వేల్ హత్యకేసులో కొత్త ట్విస్ట్.. దివ్య కుటుంబసభ్యుల వాంగ్మూలంతో షాకైన పోలీసులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో దారుణహత్యకు గురైన బ్యాంక్ ఉద్యోగిని దివ్య(25) కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దివ్యను హత్య చేసినట్లు అనుమానిస్తున్న వెంకటేశ్‌తో ఆమెకు మూడు నెలల కిందటే వివాహమైనట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఓయూలో చదువుకున్న సమయంలో దివ్య వెంట పడిన వెంకటేశ్ ఆమెను ప్రేమపేరుతో వేధించి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాల మధ్య ఈ పెళ్లి చిచ్చుపెట్టింది. దీంతో దివ్య కొద్దిరోజులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని పుట్టింటికి వచ్చేసింది. Also Read: ఆ తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమైన దివ్య ఆరు నెలల క్రితమే ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్) బ్యాంకు శాఖలో జాబ్ సంపాదించింది. ఉద్యోగం నిమిత్తం ప్రస్తుతం గజ్వేల్‌లో నివాసముంటోంది. కొంతకాలంగా తనతో పాటు వచ్చేయాలని దివ్యను వెంకటేశ్ తీవ్రంగా వేధిస్తున్నాడు. దీనిపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇకపై దివ్య వెంట పడనని లేఖ రాసి పోలీసులకు ఇచ్చాడు. Also Read: దివ్యకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న వెంకటేశ్ కొద్దిరోజులుగా ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదన్న ఆక్రోశంతో మంగళవారం సాయంత్రం ఆమె అద్దెకుండే గదికి వెళ్లి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32ibTHz

Post a Comment

0 Comments