ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో చూశాడన్న కోపంతో బాలుడిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుప్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సొట్టకవుండమ్‌పాలయం సమీప ప్రాంతానికి చెందిన తంగరాజ్- సుమతి దంపతులకు విఘ్నేష్ (9), పవనేష్ (8) అనే కుమారులున్నారు. భార్యభర్తలిద్దరూ ఓ బనియన్ కంపెనీలో పనిచేస్తూ... ఉదయాన్నే వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. Also Read: శుక్రవారం కంపెనీ నుంచి వచ్చిన దంపతులకు చిన్న కొడుకు పవనేష్ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో ఊత్తుకులి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఓ చెరువు వద్ద పవనేష్ మృతదేహాన్ని గుర్తించారు. అతడి కడుపు, గొంతు భాగాల్లో కత్తితో పొడిచిన గాయాలుండటంతో హత్యగా నిర్ధారించారు. 8ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా ఎవరు చంపి ఉంటారోనని స్థానికంగా ఆవేదన చెందారు. Also Read: ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఏడు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. పవనేష్ ఇంటి పక్కనే ఉండే యువతితో ప్రేమాయణం నడుపుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. పాలిటెక్నిక్ చదువుతున్న యువకుడు, ఆ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం ఇద్దరూ బయటకు వెళ్లి చెరువుగట్టుపై ఉన్న పొదల్లో ఏకాంతంగా గడపసాగారు. అదే సమయంలో అలుగా నడుచుకుంటూ వెళ్తున్న పవనేష్ వారిని చూశాడు. దీంతో బాలుడు తమ గురించి అందరికీ చెప్పేస్తాడని భయపడిన ఆ ప్రియుడు పవనేష్‌ను కత్తితో పొడిచి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UHo1PL
0 Comments