మిస్ట్‌కాల్ పరిచయం.. వివాహితతో అఫైర్.. చివరికి ఆమె భర్త చేతిలోనే

మిస్ట్‌కాల్ ద్వారా పరిచయమైన వివాహితతో పెట్టుకున్న యువకుడు ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరు రూరల్‌ ఏరియా మాదావరకు చెందిన చంద్రశేఖర్(20) అనే యువకుడికి కొంతకాలం క్రితం ఓ మహిళ మిస్ట్‌కాల్ ద్వారా పరిచయమైంది. ఇద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న ఆ జంట ఇళ్ల నుంచి పారిపోయి ఓ చోట కాపురం పెట్టారు. Also Read: తన భార్య సడెన్‌గా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త అనేక ప్రాంతాల్లో గాలించాడు. చివరికి చంద్రశేఖర్‌తో ఆమె కలిసి ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆమె బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవల మరోసారి ఆమె ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆ భర్త తట్టుకోలేకపోయాడు. Also Read: తన సంసారాన్ని నాశనం చేస్తున్న చంద్రశేఖర్‌ను చంపేయాలనుకున్నాడు. కొద్దిరోజుల క్రితం మహిళ భర్త, బంధువులు కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30gCBkR

Post a Comment

0 Comments