జిల్లాలో యువతి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం నింపింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కళ్లెదుటే కుమార్తె మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఆమె కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో తల్లడిల్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బందపల్లి గ్రామానికి చెందిన పాపయ్య, జానకమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. చిన్నకుమార్తె హేమలత(20) ఇంటర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. Also Read: శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హేమలత ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోతున్న కూతుర్ని గమనించిన తల్లిదండ్రులు నీళ్లు పోసి ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ మంటలు భారీగా ఎగసి వారి కళ్లెదుటే యువతి కాలిపోయింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న మెళియాపుట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొన్నారు. హేమలత సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు తల్లిదండ్రులు కారణాలు చెప్పలేకపోవడంతో పోలీసులు కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dZ1uFt
0 Comments