విశాఖలో విషాదం.. సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరు యువకులు..

సిమెంట్ లారీ బైక్‌ని ఢీకొట్టడంతో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందిన విషాద సంఘటన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. చింతపల్లి మండలం దుప్పిలవాడ పంచాయతీలోని గుండాలగరువుకి చెందిన వంతాల విజయ్(20), కిల్లో కృష్ణ, ధారకొండ పంచాయతీ పెద్దగంగారం గ్రామానికి చెందిన కిల్లో మహేష్(25) ఒకే బైక్‌పై బయల్దేరారు. చింతపల్లి నుంచి పాడేరు వెళ్తుండగా జి.మాడుగుల మండలం బందవీధి వద్ద ఎదురుగా వచ్చిన సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కి సమాచారం అందించారు. ముగ్గురినీ అంబులెన్స్‌లో ఎక్కించి పాడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Also Read: క్షతగాత్రులను పరీక్షించిన వైద్యులు అప్పటికే విజయ్, కృష్ణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రగాయాలపాలైన మహేష్ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30PqDik

Post a Comment

0 Comments