కాళ్ల పారాణి ఆరకముందే ఓ కొత్త జంట ప్రాణం పోయింది. పెళ్లై 24 గంటలు కూడా గడవక ముందే వధువు హత్య చేసి వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తొలి రాత్రే చివరి రాత్రయ్యింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్ అనే యువకుడు సాదనకుప్పంకు చెందిన తమ సమీప బంధువు సంధ్యను బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ కావటంతో వారి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లి జిరిగింది. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలోనే పెళ్లికూతురు, పెళ్లికొడుకు మధ్య వాగ్వాదం జరిగింది. Read More: దీంతో బంధువుల కలుగజేసుకొని ఇద్దరికి సర్ది చెప్పారు. దీంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. ఇక వారిని ఇంటికి తీసుకువచ్చారు. కొత్త జంట తొలి రాత్రి కోసం గదిని కూడా అందంగా అలంకరించారు. వధూవరులను గదిలోకి పంపించారు. అయితే గదిలో కూడా పెళ్లి పందిరిపై మరోసారి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మొదటి రాత్రి సమయంలో మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారు. దాంతో వరుడు నివాసన్ సంధ్యను హత్య చేశాడు. అనంతరం అక్కడనుంచి పరార్ అయ్యాడు. Read More: తెల్లారి ఎంత సమయం అవుతున్న ఇద్దరూ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు తీసి చూశారు. ఉదయం వారి గదిలోకి వచ్చిన మహిళలు సంధ్య చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అయితే వరుడి నివాసన్ కోసం గాలించగా అతడు కూడా గ్రామంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UwuNYc
0 Comments