పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహితతో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి పరారైన యువకుడిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలే తన వివరాలను ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అది చూసిన యాసరుల్లా(25) అనే యువకుడు ఆమెకు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. Also Read: అతడి వివరాలన్నీ నచ్చడంతో అతడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే తాను పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల కొంతకాలం సహజీవనం చేద్దామని యాసరుల్లా చెప్పడంతో ఆమె సరేనంది. దీన్ని అవకాశంలో తీసుకున్న అతడు ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంకెంతకాలం సహజీవనం చేద్దాం... వెంటనే పెళ్లి చేసుకో అని ఆమె కోరడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hqFzci
0 Comments