తన భార్యను తీసుకుపోయాడని కక్ష... ప్రియుడిని చంపి రక్తం తాగిన భర్త

అక్రమ సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాత్కాలిక సుఖం కోసం ప్రాకులాడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాగే తన భార్యకు మాయమాటలు చెప్పిన తీసుకుపోయిన వ్యక్తిని భర్త దారుణంగా చంపేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. డీజే హళ్లి ప్రాంతానికి చెందిన తబ్రేజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుభాన్ అనే యువకుడు తబ్రేజ్‌ భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కలిసి వేరే ప్రాంతానికి పారిపోయారు. భార్య ఆచూకీ కనిపెట్టిన తబ్రేజ్ ఆమెకు నచ్చజెప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఆమె సుభాన్‌తో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. Also Read: దీంతో భార్యను తనకు కాకుండా చేసిన సుభాన్‌పై తబ్రేజ్ కక్ష పెంచుకున్నాడు. అతడిని చంపేయాలని నిర్ణయించుకుని తన ఇద్దరు స్నేహితులతో కలిసి అతడిని మే నెలలో తుమకూరులో కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. అనంతరం చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్స్‌డేటా ఆధారంగా తబ్రేజ్‌ భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు సుభాన్‌తో అక్రమ సంబంధం ఉందని, ఓసారి అతడితో పారిపోయానని, ఆ కక్షతో భర్తే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. Also Read: దీంతో పోలీసులు తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తన ఇద్దరు స్నేహితులు నిజామ్, అలీతో కలిసి సుభాన్‌ను తానే హత్య చేశానని, అనంతరం అతడి రక్తాన్ని కూడా తాగానని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతోనే అతడిని హత్యను చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు తబ్రేజ్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తబ్రేజ్‌పై బెంగళూరులోని అనేక పోలీస్‌‌స్టేషన్లలో దొంగతనం కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3feg4ta

Post a Comment

0 Comments