ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్మ.. ఖమ్మంలో విషాద ఘటన


ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మణానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆదివారం విషాదం నింపింది. వరంగల్‌ నగరంలోని లేబర్‌ కాలనీకి చెందిన గడ్డికొప్పుల శ్రీకాంత్‌(25), ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతి సమీప బంధువులు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో కొద్దిరోజులుగా రెండు కుటుంబాల్లోనే గొడవలు జరుగుతున్నాయి. తన ప్రేమ వ్యవహారంపై చర్చించేందుకు ఖమ్మం లెనిన్‌నగర్‌లో నివాసం ఉంటున్న తన మేనమామ హరి ఇంటికి శ్రీకాంత్‌ వచ్చాడు. వారిద్దరు కలిసి యువతి ఇంటికెళ్లి పెళ్లి గురించి చర్చించారు. అక్కడ గొడవ జరగడంతో పంచాయితీ పోలీస్‌స్టేషన్‌‌కు చేరింది. Also Read: ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అంటే తనకు ఇష్టం లేదని యువతి పోలీసుల సమక్షంలో చెప్పడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం పురుగుల మందు తాగిన శ్రీకాంత్‌ను మేనమామ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి కుటుంబసభ్యులు చర్చలకు పిలిచి కొట్టడం వల్లే తన మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి దక్కడం లేదన్న ఆవేదనతో శనివారం రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కుమారుడిని యువతి కుటుంబం మానసికంగా వేధించారని తల్లి, సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఖమ్మం టూటౌన్ పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zbEhAM

Post a Comment

0 Comments