తాటిచెట్టుపైనే గీత కార్మికుడి మృతి.. తలకిందులుగా వేలాడి.. పశ్చిమ గోదావరిలో విషాదం


పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్లు కోసం తాటిచెట్టెక్కిన గీత కార్మికుడు చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మాధవరావు(40) రోజు మాదిరిగానే కల్లు గీసేందుకు తాటిచెట్టెక్కాడు. ఎక్కిన కొద్దిసేపటికి చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయి కిందకి వేలాడాడు. చెట్టుకి వేలాడుతూ కనిపించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది చెట్టుకి వేలాడుతున్న మాధవరావు మృతదేహాన్ని కిందకి దించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక వాహనం తెచ్చి చెట్టుకి నిచ్చెన వేసి శవాన్ని కిందకి దించారు. చెట్టెక్కిన గీత కార్మికుడు కల్లు గీస్తూనే మృత్యువాతపడడం గ్రామస్తులను కలచివేసింది. Also Read: చెట్టుపైన ఎలా చనిపోయాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుండెపోటుతో చనిపోయాడా? లేక మరేదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాలికి తాటిమట్ట బలంగా తగలడం వల్లే మాధవరావు చనిపోయాడని స్థానికులు చెబుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eXoEfG

Post a Comment

0 Comments