గ్యాంగ్ రేప్ చేసి వ్యభిచారం కూపంలోకి దించి.. వైజాగ్‌లో గుడివాడ యువతికి నరకం

ఉపాధి కోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ యువతి దుర్మార్గులు, కామాంధుల చేతిలో చిక్కి నరకం అనుభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతిని ఉపాధి కల్పిస్తామని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశారు. బాధితురాలు గాజువాక పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురు నిందితులు కటకటాల పాలయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ దరి ధనియాలపేటకు చెందిన ఓ యువతి(19) చదువు మధ్యలో ఆపేసి ఓ షాపులో పనిచేసేది. ఈ ఏడాది జనవరి 1న తల్లితో గొడవపడిన ఆమె కలువపూడిలోని తాతగారి ఇంటికి వెళ్లడం కోసం బయల్దేరింది. కలువపూడి వైపు వెళ్లే రైలు కాకుండా పొరపాటుగా తిరుపతి వెళ్లే రైలు ఎక్కేసింది. తిరుపతి రైల్వేస్టేషన్లో బిత్తర చూపులు చూసుకుంటూ వెళ్తున్న యువతిని గమనించిన వైజాగ్‌కు చెందిన బి.ఉమామహేశ్వరి అనే మహిళ ఆమెతో పరిచయం పెంచుకుంది. వివరాలన్నీ తెలుసుకున్నాక విశాఖలో పని ఇప్పిస్తానని చెప్పి యువతిని తనతో పాటు తీసుకెళ్లింది.

యువతిని మధురవాడలోని వాంబే కాలనీలోని తన ఇంట్లో కొద్దిరోజులు ఉంచిన ఉమామహేశ్వరి తర్వాత తన బంధువుకు అప్పగించింది. అతడు నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఉమామహేశ్వరి మరదలు గౌరీలక్ష్మికి చెప్పగా... తన చెల్లెలు కుమారి వద్ద పని ఉందంటూ పంపించింది. అక్కడ యువతిని బెదిరించి కుమారి బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలోనే వాసిరెడ్డి సతీష్ అనే వ్యక్తి కుమారి వద్దకు వెళ్లి పోలీసునని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు.

Also Read:

ప్రేమజంట పరార్.. యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి కుటుంబం

అక్కడే ఉన్న యువతి తనను రక్షించాలని వేడుకోవడంతో సతీష్ తన వెంట తీసుకెళ్లాడు. ఆమెను గాజువాకలోని గంట నాగమణి, బి.గోవింద్‌ల ఇంటికి తీసుకెళ్లి రెండ్రోజులు అక్కడే ఉంచాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీహరిపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడు ఉంచారు. వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకోవడంతో పాటు వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో సతీష్ కనిపించకుండా పోయాడు. తెలిసిన వారి ద్వారా నర్సీపట్నంలోని అమ్మిపేటలో ఉన్నట్టు తెలుసుకున్న బాధితురాలు గంట నాగమణి, గోవింద్‌లతో కలిసి గత నెల 30న అక్కడికి వెళ్లింది.

Also Read:

ముంబయి యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

సతీష్ తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. ఆ రాత్రికి నర్సీపట్నంలోని ఓ ఇంట్లో తలదాచుకున్న యువతి.. మరుసటి రోజు తన తల్లికి ఫోన్ చేసి కాకినాడలో ఉన్నానని ఫోన్ చేసింది. వారి సాయంతో ఆదివారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్వరి, కుమారి, నాగమణితో పాటు సతీష్‌, అతడికి సహకరించిన గోవింద్‌ను అరెస్ట్ చేశారు.

Also Read:

అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై బాంబుదాడి



from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3e5aZ65

Post a Comment

0 Comments