ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో అఫైర్.. భార్యను నిర్బంధించి, గుండు గీయించిన భర్త

భార్య ఫేస్‌బుక్‌కు బానిసై ఇంటి పనులు పట్టించుకోకపోవడంతో పాటు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను గదిలో బంధించి గుండు గీయించాడు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సాయంతో బాధితురాలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పెరుందురై అలంగాట్టు తోట్టం వావికడై సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయం చేస్తూ భార్య, కుమారుడు(16), కుమార్తె(15)ను పోషిస్తున్నాడు. అతడి భార్య కొన్నాళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగిస్తూ ఫేస్‌బుక్‌కు బానిసైంది. Also Read: రోజూ గంటల తరబడి ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌తో ఛాటింగ్ చేస్తూ ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలోనే షణ్ముగయ్య అనే ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో ఆమెకు ఏర్పడింది. ఆమె భర్త పొలానికి వెళ్లిన సమయంలో షణ్ముగయ్య ఇంటికి వచ్చి ఆమెతో రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. తాను అందంగా ఉన్నాను కాబట్టే ఫేస్‌బుక్‌లో చాలామంది ఫ్రెండ్ రిక్వెస్టులు పెడుతున్నారని, తన విషయంలో కలుగజేసుకోవద్దని ఆమె ఎదురు మాట్లాడింది. Also Read: దీంతో కోపోద్రిక్తుడైన భర్త, తన తమ్ముడి సాయంతో ఆమె చేతులు, కాళ్లు కట్టేసి గదిలో బంధించాడు. గుండు గీయించి అంద విహీనంగా తయారుచేశాడు. కొద్దిరోజుల తర్వాత బాధితురాలు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఆమె ఫ్రెండ్స్‌ సామాజిక సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ మహిళ వివరాలు తెలుసుకుని రక్షించి వ్యానులో తరలిస్తుండగా భర్త బైక్‌పై వచ్చి అడ్డుకున్నాడు. అధికారులు అతడికి గుర్తింపు కార్డులు చూపించిన తర్వాత బాధితురాలిని కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు భర్త, మరిదిపై కేసు నమోదు చేశారు. అయితే ఫేస్‌బుక్‌ వల్ల తన భార్య మతిస్థిమితం కోల్పోయిందని, అందువల్ల చికిత్స కోసం గుండు గీయించినట్లు ఆమె భర్త పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ux57Lc

Post a Comment

0 Comments