ప్రియురాలితో బలవంతపు శృంగారం.. కోరిక తీరాక మొహం చాటేసిన ప్రియుడు

పెళ్లి పేరుతో యువతిని మోసగించి శారీరక వాంఛలు తీర్చుకుని మొహం చాటేసిన యువకుడిని జిల్లా మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఆంజనేయస్వామిగుడి వీధికి చెందిన యువతి (27), ఇదే ప్రాంతానికి చెందిన నయాబ్‌షాజద్‌ ఆలీ (25) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమెను ఏకాంతంగా కలుసుకున్న ఆలీ ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని బలవంతపెట్టి లైంగికంగా అనుభవించాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం.. ఆ కథ ముగిసిందంటూ ప్లేటు పిరాయించాడు. ఎన్నిసార్లు కోరినా అతడు పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయాబ్‌షాజద్‌ ఆలీపై రేప్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: కర్నూలులో మరో కేసు.. ప్రేమిస్తున్నానంటూ యువతి మూడేళ్ల వెంటపడి అవసరం తీరాక మరొకరితో పెళ్లికి సిద్ధమైన యువకుడు కటకటాల పాలైన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన యువతి సంకిరేణిపల్లె గ్రామానికి శివ దుర్గాప్రసాద్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించి ఆమె నుంచి అనేకసార్లు డబ్బులు తీసుకున్న శివ గుట్టుగా మరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ముచ్చుమర్రి పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శివ దుర్గాప్రసాద్‌ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Aw1mPm

Post a Comment

0 Comments