నాలుగేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని జరిగింది. సమీపంలోని నల్లాటూరు గ్రామానికి చెందిన మనిమేఘలై(20), తాళవేడు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్(25) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాజ్‌కుమార్ ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం రాజ్‌కుమార్ ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించే ప్రసకే లేదని అతడి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. Also Read: దీంతో మనస్తాపం చెందిన మనిమేఘలై ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని రాజ్‌కుమార్‌ను ఒత్తిడి చేసింది. అయితే కుటుంబాన్ని వదిలి తాను రాలేనని, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తాను పెళ్ల చేసుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన మనిమేఘలై శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2B2H3ce
0 Comments