దివ్య హత్యకేసులో మరో ట్విస్ట్... వ్యభిచారం చేయాలంటూ వేధించిన భర్త

రాష్ట్రవ్యా ప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దివ్య హత్యపై విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే దివ్య జీవితం అర్ధంతరంగా ముగిసిపోవడానికి పరోక్షంగా కారణమైన ఆమె భర్త దొరబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. దివ్యకు 2018లో దొరబాబు అనే వ్యక్తితో వివాహమైంది. Also Read: మూడు నెలలు కాపురం చేసిన తర్వాత వ్యభిచారం చేయాలంటూ దివ్యను భర్త వేధించడం మొదలుపెట్టాడు. అతడికి దివ్య పిన్ని కూడా వంత పాడటంతో ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. వీరి ఒత్తిడి తట్టుకోలేకే దివ్య విశాఖపట్నం వెళ్లిపోయి వసంత వద్దకు చేరింది. ఇప్పటికే దివ్య పిన్నిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ఆమె బాబాయ్ కోసం గాలిస్తున్నారు. దివ్య భర్త దొరబాబును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులను మళ్లీ విచారించడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3f6QFS1

Post a Comment

0 Comments