తాగుబోతు భర్తను గొంతు కోసి చంపేసిన భార్య.. వనపర్తిలో దారుణం

మద్యానికి బానిపై నిత్యం అనుమానిస్తూ వేధిస్తున్న భర్తను గొంతు కోసి కిరాతకంగా చంపేసిందో ఇల్లాలు. ఈ ఘటన తెలంగాణలోని జిల్లా మందడి మండలం స్కూల్ తండా గ్రామంలో వెలుగుచూసింది. పుల్యా తండాకు చెందిన బాల్య నాయక్‌కు మణెమ్మతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కూతురు ఉంది. బాల్య నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేకపోవడంతో కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేశాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న బాల్యనాయక్... రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటుండటంతో ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. ఆమెకు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. Also Read: దీనికి తోడు ఇటీవల మద్యానికి బానిసైన అతడు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. మంగళవారం రాత్రి కూడా దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. భర్త వేధింపులతో విసిగిపోయిన మణెమ్మ కూతురి సాయంతో నిద్రమత్తులో ఉన్న భర్తను గొంతు కోసి చంపేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cSgMdG

Post a Comment

0 Comments