శారీరక వైకల్యంతో బాధపడుతూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ముప్పాళ్ల మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ (43) మాట్లాడలేదు. దీనికి తోడు ఓ చేయికి పోలియో సోకడంతో పెళ్లి చేసుకోకుండా కుటుంబంతో కలిసి జీవిస్తోంది. సోమవారం ఉదయం పొలానికి వెళ్లిన ఆమె అక్కడ కట్టెలు ఏరుకుంటుండగా అదే గ్రామానికి చౌడయ్య (55) గమనించాడు. Also Read: ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను గడ్డివాము వద్దకు లాక్కెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంటికి వెళ్లి తన సోదరుడికి చెప్పి బోరుమంది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యా్ప్తు చేపట్టామని, నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yd1jQp
0 Comments