భార్య చెల్లెలిపై కామంతో రెచ్చిపోయిన బావ.. ఆమెకి తెలిసిపోవడంతో..

నిండు గర్భంతో ఉన్న అక్కకి సాయంగా ఇంటికొచ్చిన మరదలిపై కన్నేశాడో ప్రబుద్దుడు. భార్య లేని సమయంలో ఆమె చెల్లెలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గదిలోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చెల్లెలి జీవితాన్ని నాశం చేశాడన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయిన భార్య.. కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది. నెలలు నిండిన భార్య తన భర్త శవాన్ని ఇంటి వెనక పాతిపెట్టింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. శిఖర్ పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న వివాహితకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఆమె చెల్లెలు(15) అక్క ఇంటికొచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన బావ మరదలిపై కన్నేశాడు. భార్య లేని సమయం చూసి ఆమె చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Also Read: ఆ విషయం మరుసటి భార్యకి తెలియడతో ఆగ్రహానికి గురైంది. కడుపుతో ఉన్న తనకి సాయం చేసేందుకు వచ్చిన చెల్లెలిని భర్త కామంతో కాటేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. చెల్లెలి జీవితాన్ని పాడుచేసిన భర్తని గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేసింది. దారుణంగా నరికి చంపేసింది. 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ భర్త శవాన్ని ఇంటి వెనుక పెరట్లోకి లాక్కెళ్లి గొయ్యి తవ్వి పాతిపెట్టేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. తన భర్తని హత్య చేసినట్లు చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలి చెల్లెలిపై జరిగిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/307tJxC

Post a Comment

0 Comments