‘నా ఒంటిపై బట్టల్లేవ్.. సిగరెట్లతో కాల్చారు..’ భార్య గ్యాంగ్ రేప్ కేసులో దారుణాలు


గ్యాంగ్ రేప్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యకి మద్యం తాగించి నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి భర్త గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన సంగతి తీవ్ర కలకలం రేపింది. కన్నకొడుకు ముందే తల్లిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. సంచలనంగా మారిన ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు తవ్వేకొద్దీ దారుణాలు బయటపడుతున్నాయి. కాపపిశాచుల దాష్టీకానికి బలైన బాధితురాలు పిల్లలను ఇంటి వద్ద వదలివస్తానని చెప్పి తప్పించుకుని వచ్చినట్లు వెల్లడైంది. తనను లాక్కెళ్లి వాహనంలో పడేసి నిర్మానుష్య ప్రదేశంలో తీసుకెళ్లారని.. అక్కడ తీవ్రంగా కొట్టారని బాధితురాలు తెలిపింది. తాను స్పృహ‌ కోల్పోయానని.. తన కొడుకు ఏడుపు విని లేచినట్లు ఆమె పేర్కొంది. ఐదేళ్ల వయసున్న తన కొడుకు ముందే తనను అమానుషంగా గ్యాంగ్ రేప్ చేశారని ఆమె ఆరోపించింది. తన కొడుకును కూడా వారు హింసించారని ఆమె చెప్పింది. తనను సిగరెట్లతో కాల్చారని.. నరకం చూపించారంటూ కన్నీటిపర్యంతమైంది. Also Read: ఆ రోజు అనుభవాలను భాధితురాలు గుర్తు చేసుకున్నారు. తాను స్పృహ‌లోకి వచ్చి చూసేప్పటిక తన ఒంటిపై బట్టలు లేవని.. కేవలం తన టాప్‌ మాత్రమే ఉందని ఆమె తెలిపింది. తన కొడుకు ఏడుస్తుండడంతో ఇంట్లో వదిలిపెట్టి తిరిగి వస్తానని చెప్పి బతిమిలాడానని.. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి కొడుకుతో సహా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డుకు వచ్చానని ఆమె పేర్కొంది. బైక్‌పై వెళ్తున్న యువకుడు తనకు సాయం చేశాడని.. కారులో ఇంటికి పంపించాడని పేర్కొంది. బీచ్‌కని చెప్పి భార్యాబిడ్డలను తీసుకెళ్లిన భర్త.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించాడని.. అనంతరం ఫ్రెండ్స్‌తో కలసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ‘రోజు మాదిరిగానే బీచ్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆమె భర్త ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి మందు పార్టీ ఏర్పాటు చేశాడు. భార్యతో బలవంతంగా మద్యం తాగించి ఆమెను తన ఫ్రెండ్స్‌ వద్ద వదిలేసి భర్త వచ్చేశాడు’ అని బాధితురాలి తల్లి ఆరోపించింది. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eV5Uxl

Post a Comment

0 Comments