తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అదనపు రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘వన్ నేషన్ వన్ రేషన్’ కార్డు వ్యవస్థకు సంబంధించిన సంస్కరణలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకరంగా అదనపు రుణాలను మంజూరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాలు దేశంలో ప్రస్తుతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ పథకం సంస్కరణల కోసం నిర్దేశించిన షరతులను తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, గోవా రాష్ట్రాలు నెరవేర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ 9 రాష్ట్రాలకు రూ.23,523 కోట్ల అదనపు రుణాలు ఇవ్వడానికి అనుమతించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (డిసెంబర్ 10) ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,525 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు అదనంగా రుణాలు అందనున్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద.. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా తమ రేషన్ సరకులు తీసుకోవచ్చు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారు తెలంగాణలో, తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారు ఏపీలోనూ రేషన్ సరకులు తీసుకోవచ్చు. ఇదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ సరకులు తీసుకోవచ్చు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3gBnUPd
0 Comments