తండ్రి ‘హుందాతనం’ నచ్చక చంపేసిన కొడుకు.. చిత్తూరులో దారుణం

ఎప్పడూ నలుగురు గ్రామస్తులతో కలసి తిరుగుతూ.. తన వద్దకు వచ్చిన వారికి చిన్న చిన్న ఖర్చులు పెడుతుండేవాడు తండ్రి. జనాలతో తిరుగుతూ అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటూ కుటుంబం కోప్పడేది. తండ్రి హుందాతనం కొడుక్కి దుబారాగా కనిపించింది. చివరికి అదే తండ్రి హత్యకు దారితీసింది. ఇంటి గొడవ పెద్దదై ఆవేశంలో కన్నకొడుకే తండ్రిని దారుణంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన జిల్లాలో జరిగింది. ములకలచెరువు మండలం చౌడసముద్రం పంచాయతీ గుత్తావారిపల్లెతాండాకి చెందిన గుర్రప్ప నాయుడు(70)కి గ్రామంలో సుమారు 20 ఎకరాల పొలం ఉంది. ఆయన వయసు మీద పడడంతో కొడుకు వెంకట రమణ నాయుడు(45) భూమిని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో నలుగురితో కలివిడిగా ఉండే గుర్రప్ప నాయుడు తన వద్దకు వచ్చిన వారికి టీ, టిఫిన్లు అంటూ చిన్నచిన్న ఖర్చులు పెడుతుండేవాడు. తనకు వచ్చే పింఛనుతో పాటు నెలనెలా ఇంట్లో రూ.5 వేలు తీసుకునేవాడు. అది ఆయన హుందాతనంగా భావించేవాడు. అయితే అదే విషయం కుటుంబ సభ్యులకి నచ్చేది కాదు. డబ్బులు దుబారాగా ఖర్చు చేస్తున్నాడంటూ కుటుంబ సభ్యులు కోప్పడేవారు. ఈ క్రమంలో తనకు వెయ్యి రూపాయలు కావాలంటూ గుర్రప్ప భార్య రామలక్ష్మమ్మతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో భార్యపై గుర్రప్ప చేయిచేసుకున్నాడు. తల్లిని కొట్టడం చూసిన కొడుకు వెంకటరమణ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవేశంలో కట్టె తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. Also Read: రక్తపు మడుగులో కిందపడి ప్రాణాలు వదిలిన తండ్రిని చూసి భయాందోళనకు గురైన వెంటకరమణ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య రామలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oBswI8

Post a Comment

0 Comments