ప్రియురాలు మూడేళ్లు పెద్ద.. రిలేషన్‌షిప్ వద్దన్నందుకు..!

సోషల్ మీడియా విస్తృతమయ్యాక విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ యాప్‌లతో సులభంగా స్నేహితులు అయిపోవడంం.. ప్రేమించుకోవడం జరిగిపోతున్నాయి. వయసు తేడాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతవరకూ బాగానే ఉన్నా ఎవరైనా వారి బంధానికి అడ్డుచెబితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. టీనేజ్ ఉడుకులో దారుణాలకు తెగబడుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి వెలుగుచూసింది. తనకంటే పెద్దదైన యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్న టీనేజ్ యువకుడు ఆమె నానమ్మ, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పూర్‌‌లోని హజారిపహాడ్‌కి చెందిన టీనేజ్ యువకుడు(17)కి సోషల్ మీడియా ద్వారా అదే ప్రాంతానికి చెందిన యువతి(20) పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో యువతి నానమ్మ అడ్డుచెప్పింది. అతనితో తిరగొద్దని.. ఫ్రెండ్‌షిప్ కట్ చేయమని హెచ్చరించింది. ఆ విషయం తెలుసుకున్న యువకుడు యువతి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగాడు. దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో యువతిని సురేంద్ర నగర్‌లోని మేనమామ ఇంటికి పంపించేశారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆమె నానమ్మ(60), తమ్ముడు(10)ని దారుణంగా హత్య చేశాడు. బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసిన యువతి తల్లి హతాశురాలైంది. ఇంట్లో అత్త విగతజీవిగా పడి ఉంది. వెంటనే ఆమె తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘిట్టికదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2W69r4D

Post a Comment

0 Comments