దుర్గా మాతా ఆశీస్సులతోనే ఇవాళ బయటపడ్డా: జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దుర్గా మాతా ఆశీస్సులతోనే తాను ఇవాళ బయట పడ్డానని ఘటన అనంతరం వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఆయన దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జేపీ నడ్డా వస్తున్నారనే సమాచారం తెలుసుకొని బుధవారం (డిసెంబర్ 10) ఉదయం రహదారిని దిగ్బంధించిన కొంత మంది ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అనంతరం వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. ఈ ఘటనలో జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగాల్ బీజేపీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37NIp7v

Post a Comment

0 Comments