సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన యువ జంట తెల్లారేసరికి విగతజీవులుగా కనిపించారు. మునగాల మండల పరిధిలోని మోద్దుల చెరువు శివారులో వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిది చివ్వెల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్(21), కేశ బోయిన మహేశ్వరి(18)గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. యువజంట ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన జంట రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బైక్‌పై మోద్దుల చెరువు స్టేజ్ దగ్గరికి వచ్చి పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలంలో బైక్ ఉంది. చెట్టుకు వేలాడుతున్న జంటని ఈ రోజు ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3gBztpx
0 Comments