నెత్తురు మడుగులో భార్య.. పక్కనే కూర్చుని భర్త.. షాకింగ్

నెత్తురు మడుగులో మహిళ పడి ఉంది. పక్కనే ఆమె భర్త కూర్చుని చేస్తున్న పని చూసి స్పాట్‌కి వచ్చిన పోలీసులు షాక్‌కి గురయ్యారు. భర్త వికృత చేష్టలు చూసి కంగుతిన్నారు. భార్యను దారుణంగా హత్య చేసి శవం పక్కనే ఫోన్‌లో ఆడుకుంటున్న భర్తని చూసి అవాక్కయ్యారు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. జోధ్‌పూర్‌కి చెందిన విక్రమ్ సింగ్(35), శివ్ కన్వార్(30) భార్యాభర్తలు. ఏ పనీ చేయకుండా భర్త జులాయిగా తిరిగేవాడు. భార్య కన్వార్ కుట్టుపని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇద్దరి మధ్య వివాదం జరగడంతో విక్రమ్ సింగ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. కుట్టుపనికి ఉపయోగించే కత్తెరలు తీసుకుని భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమెను కత్తెరలతో పొడిచి పొడిచి చంపేశాడు. ఆ విషయం అత్తమామలకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడు చేస్తున్న పని చూసి షాకయ్యారు. నెత్తుటి మడుగులో భార్య పడి ఉంటే.. ఆమె పక్కనే కూర్చుని సెల్‌ఫోన్‌లో వీడియోగేమ్ ఆడుతూ కనిపించాడు. ఏమాత్రం పట్టనట్టు ఫోన్‌లో ఆడుకుంటున్న భర్త వికృత చేష్టలు చూసి అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రక్తపు మడుగులో పడి ఉన్న భార్యని ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JX1tI6

Post a Comment

0 Comments