జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించానని, తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు నడ్డా పేర్కొన్నారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇంటికే పరిమితమయ్యానని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నడ్డా కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిన వెంటనే పలువురు బీజేపీ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. వారిలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oLb9oc
0 Comments