కరోనా కష్టకాలంలో కార్మికులు, కర్షకులను సొంతూళ్లకు పంపి ఆపద్భాందవుడిగా పేరు తెచ్చుకున్న సినీ నటుడు సోనూసూద్.. సెకండ్ వేవ్‌లో తన సేవలను విస్తృతం చేశారు. ముఖ్యంగా దొరక్క ప్రాణాలు కోల్పోతుండడం చూసి పలుచోట్ల త్వరితగతిన ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తోన్న సోనూసూద్ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోకూడదన్న ఉద్దేశంతో ఇంటికే ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని సూచించారు. ఆక్సిజన్ కోసం వెబ్‌సైట్‌లో సంప్రదించిన వారికి ఇంటికే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తామన్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిస్తామని తెలియజేశారు. అందుకోసం డీటీడీసీ కొరియర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆక్సిజన్ అవసరం ఉన్న బాధితులు దేశంలో ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా సిలిండర్ ఇంటికి పంపించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3i2HfeU
0 Comments