ఒమిక్రాన్‌కు ప్రస్తుత టీకాలు పనిచేయకపోవచ్చు.. మోడెర్నా సంచలన వ్యాఖ్యలు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్-19 టీకాల రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవచ్చని మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనుమానం వ్యక్తం చేశారు. అలా అయితే, వచ్చే ఏడాది తొలి నాళ్లలో మార్పులు చేసిన కొత్త ఫార్ములా షాట్‌లు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. బీబీసీ ఆండ్రూ మార్ షోలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో కొత్తరకం వేరియంట్‌ నుంచి రక్షణను అందించే ప్రస్తుత టీకా సామర్థ్యం గురించి మనం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ‘‘మనం సరికొత్త టీకాను తయారు చేయవలసి వస్తే అది 2022 ప్రారంభంలో ఉంటుందని నేను భావిస్తున్నాను.. అది నిజంగా పెద్ద పరిమాణంలో అందుబాటులో ఉంటుంది.. చెప్పుకోదగిన విషయం ఏంటంటే mRNA వ్యాక్సిన్‌లను మోడెర్నా వేగంగా రూపొందించగలదు’’ అన్నారు. వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసిన వెంటనే వందలాది మంది సిబ్బందిని మోడెర్నా సంస్థ గురువారం నియమించింది. ‘‘వైరస్ నుంచి రక్షణ ఒక వ్యక్తికి ఎంత కాలం కిందట టీకాలు వేయించుకున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో ఏదైనా తీసుకోవడం ఉత్తమమైన సలహా.. వ్యాక్సిన్ తీసుకోనివారం వెంటనే వేయించుకోవాలి.. ఇది ప్రమాదకరంగా కనిపించే వైరస్, కానీ దానితో పోరాడటానికి ఇప్పుడు మన ఆయుధశాలలో చాలా సాధనాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను’’ అని పాల్ అశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఒమిక్రాన్‌పై ప్రస్తుత తమ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే పరీక్షలపై పనిచేస్తున్నట్టు మోడెర్నా ప్రకటించింది. ‘‘2021 ప్రారంభం నుంచి ఆందోళ కలిగిస్తోన్న కొత్త వేరియంట్లను అంచనా వేయడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసింది.. 60 నుంచి 90 రోజులలో కొత్త వాటిని క్లినికల్ ట్రయల్స్‌కు తరలించే సామర్థ్యాన్ని కంపెనీ పదేపదే ప్రదర్శించింది’’ అని కంపెనీ తెలిపింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3xwuI9s

Post a Comment

0 Comments