Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

ఏపీలో తగ్గనున్న 20 శాతం మద్యం షాపులు.. 15 వేల మందికి ఉద్యోగాలు!

దశలవారిగా మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీనికి అనుగుణంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వమే మద్యం అమ్మకాలను నిర్వహించనుంది. రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ వెళతారు. తొలి విడతగా 20 శాతం దుకాణాలను తగ్గించనున్నారు. నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తొలుత 876 మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నూతన మద్యం విధానం రూపకల్పనపై ఎక్సైజ్‌ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. మద్యపాన నిషేధంలో భాగంగా... తొలిదశలో దుకాణాల సంఖ్యను కుదించాలని, ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తిగా స్వస్తి పలకాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారానే మద్యం అమ్మకాలను నిర్వహించాలని, వాటిలో పనిచేసేందుకు 15 వేల మంది సిబ్బందిని తీసుకుని ఉపాధి కల్పించాలని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి జూన్‌ నెలాఖరుతో మద్యం షాపుల గడువు ముగిసింది. కానీ కొత్త ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించడంలో జాప్యంతో వాటి గడువు మరో మూడు నెలలు పెంచారు. అయితే షాపుల సంఖ్యను కుదించారు. ప్రస్తుతం నూతన మద్యం విధానం ప్రకారం సంబంధిత శాఖ అధికారులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు పొరుగున ఉన్న తమిళనాడులో ఉన్నాయి. అక్కడి విధానమే మన రాష్ట్రంలో అమలు చేయాలన్నది జగన్ భావన. ఈ విధానం అక్టోబరు 1 నుంచి అమలు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన షాపులను ఏర్పాటు చేస్తారు. షాపుల్లో ప్రభుత్వమే సిబ్బందిని నియమిస్తోంది. రోజూ జరుగుతున్న విక్రయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దుకాణానికి వచ్చిన నిల్వ, విక్రయాలలో తేడా ఉంటే పనిచేసే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటారు. తద్వారా బెల్టు షాపులు, లూజు విక్రయాలు తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల ఎక్సై.జ్‌, అబ్కారీ శాఖపై అదనపు భారం పడతుందని అధికారులు అంటున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YwmuLa

No comments:

Post a Comment