Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 26 November 2019

ప్రియుడితో సెక్స్ చేస్తుండగా చూసిందని.. మహిళను చంపేసిన 16ఏళ్ల బాలిక

తమిళనాడులో ఘోర ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో సెక్స్ చేస్తున్న సమయంలో చూసిందన్న కారణంతో 16ఏళ్ల బాలిక తన సమీప బంధువైన మహిళను హత్య చేసింది. కొడైక్కానల్‌ పరిధిలోని పణ్ణైక్కాడు ప్రాంతానికి చెందిన కేశవన్‌, సుందరి (31) భార్యాభర్తలు. అయితే విబేధాలతో దంపతులిద్దరూ మూడేళ్లుగా విడిగా ఉంటున్నారు. వీరి 11ఏళ్ల కుమార్తె తండ్రి దగ్గరే ఉంటోంది. Also Read: దీంతో ఒంటరిగా ఉన్న సుందరి అదే ప్రాంతానికి చెందిన మురగన్‌ ఇంట్లో పనికి చేరి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ పని పేరుతో అతడి ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేది. అయితే ఈ నెల 22వ తేదీన సుందరి తన ఇంట్లోనే శవమై కనిపించింది. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదులో దాండిక్కుడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 21వ తేదీన సుందరి ఇంట్లో ఆమె సమీప బంధువైన 16ఏళ్ల బాలిక ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. Also Read: పోలీసులు తమదైన శైలిలో బాలికను ప్రశ్నించగా ప్రియుడి సాయంతో తానే చంపినట్లు అంగీకరించింది. ‘నేను దిండిక్కల్‌లోని ఓ స్కూల్‌లో 11వ తరగతి చదువుతూ ఓ యువకుడిని ప్రేమిస్తున్నాను. సుందరి మా దూరపు బంధువు. స్కూల్‌కి సమీపంలోనే ఆమె ఇల్లు ఉండటంతో తరుచూ అక్కడికి వెళ్లి ప్రియుడితో ఏకాంతంగా గడిపేదాన్ని. ఈ నెల 21వ తేదీన ప్రియుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి గదిలో ఎంజాయ్ చేస్తున్నాను. మేము సెక్స్ చేసుకుంటున్న సమయంలో సుందరి కిటికీలో నుంచి చూసింది. కొద్దిసేపటి తర్వాత మేము బయటికి రాగానే.. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో మేమిద్దరం ఆమె గొంతుకు చున్నీ బిగించి చంపేశాం. తర్వాత నేను, నా ప్రియుడు ఇళ్లకు వెళ్లిపోయాం’ అని బాలిక పోలీసులకు చెప్పింది. Also Read: అమాయకంగా కనిపిస్తున్న బాలిక ఇంత దారుణానికి పాల్పడిందని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ఆమెను అరెస్ట్ చేసి మదురైలోని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QX4l9k

No comments:

Post a Comment