
పెళ్లయి ఐదేళ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదన్న మనస్తాపంతో ఓ వివాహిత చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో బుధవారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన నాయుడు పూర్ణిమ (31)కు ఐదేళ్ల క్రిందట గుంటూరుకు రామకృష్ణతో వివాహమైంది. యూకేలో ఉద్యోగం చేసే రామకృష్ణ వివాహం తర్వాత భార్యను కూడా అక్కడికే తీసుకెళ్లాడు. ఆమెకు అన్నివిధాలా సహకారం అందించి ఎంఎస్ పూర్తి చేయించాడు. Also Read: ఆ తర్వాత ఉద్యోగం రావడంతో దంపతులిద్దరూ రెండు చేతులా సంపాదించసాగారు. అయితే వివాహమై ఐదేళ్లు అవుతున్నా పిల్లలు కలగకపోవడంతో బంధువుల నుంచి పూర్ణిమకు సూటిపోటి మాటలు పెరిగాయి. ఎక్కడికెళ్లినా అందరూ పిల్లలు ఇంకా లేరా? అంటూ అడుగుతుండటంతో మనోవేదనకు గురయ్యేది. మరో పక్క ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురైంది. Also Read: వీసా రెన్యూవల్ కోసం దంపతులిద్దరూ వారం రోజుల కిందట గుంటూరుకు వచ్చారు. ఆ పని ముగిసిన తర్వాత భర్త ఆమెను పుట్టింట్లో వదిలి వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత యూకేకి రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా పిల్లల గురించి తాను పడుతున్న ఆవేదనను ఆమె కుటుంబ సభ్యులకు వివరించి కన్నీరు పెట్టుకుంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూర్ణిమ తన గదిలో ఉరేసుకుంది. Also Read: ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్రా అసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తనకు మరో జన్మ అంటూ ఉంటే నిన్నే వివాహం చేసుకుంటానని భర్తకు.., క్షమించాలని కోరుతూ కుటుంబ సభ్యులకు రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TfRNtc
No comments:
Post a Comment