
రెండో రోజు భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అంనతరం త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. అక్కడి నుంచి నేరుగా ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీ సమాధిని సందర్శించుకున్నారు. సమాధి వద్ద పుష్ఫ గుచ్ఛం ఉంచి.. ఒక ప్రదక్షిణ చేసి గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం వహించారు. ట్రంప్, మెలనియా దంపతులకు అధికారులు రాజ్‌ఘాట్ గురించి వివరించారు. సమాధిని సందర్శించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేశారు. అనంతరం మెలనియా కూడా సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అనంతరం అధికారులు మహాత్మాగాంధీ జ్ఞాపికను ట్రంప్ దంపతులకు అందజేశారు. అనంతరం రాజ్ ఘాట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొక్కను నాటారు. రాజ్‌ఘాట్ నుంచి ట్రంప్ నేరుగా హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. ఇక్కడే భారత్, అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ హౌదరాబాద్ హౌస్ చేరుకున్నారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/38Svu3k
No comments:
Post a Comment