
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రెండో రోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ట్రంప్, మెలనియాకు కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు త్రివిధ దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు ట్రంప్‌కి రాష్ట్రపతి కోవింద్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మొత్తం 90 మంది అతిథులు పాల్గొనున్నారు. ఈ విందులో పాల్గొనడం కోసం కేసీఆర్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మెలనియా ట్రంప్.. ఢిల్లీ నానక్‌పురలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. సర్వోదయ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్‌ను సందర్శించి.. ‘హ్యాపీనెస్ క్లాస్’ ప్రోగ్రాం అమలవుతున్న తీరును ఆమె పరిశీలిస్తారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2PnAlSl
No comments:
Post a Comment