
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని పోలీసులు దూరం చేశారని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన జిల్లాలో జరిగింది. కేవీపల్లె మండలంలోని ఎంవీ పల్లె పంచాయతీ ఎగువమేకలవారిపల్లెకి చెందిన దళిత యువకుడు నాగభూషణ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తిరుపతిలో చదువుకుంటున్న సమయంలో కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లెకి చెందిన సుకన్యా రెడ్డితో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరూ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని భావించిన ప్రేమజంట ఈ నెల 14న చీనేపల్లె ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే తమ కూతురు కనిపించడం లేదంటూ సుకన్యా రెడ్డి తల్లిదండ్రులు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రియుడి స్వగ్రామం ఎగువమేకలవారిపల్లెకి చేరుకున్నారు. నవ దంపతులతో పాటు వరుడి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. Also Read: మేజర్ అయిన సుకన్యా రెడ్డి తాను నాగభూషణతోనే ఉంటానని లిఖితపూర్వకంగా తెలియజేసినా పట్టించుకోని పోలీసులు వరుడు, అతని తల్లిదండ్రులను బెదిరించి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగభూషణ చీనెపల్లె చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన గ్రామస్తులు అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న కేవీ పల్లె పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చ తల్లిదండ్రులకు అప్పజెప్పారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33V8W0z
No comments:
Post a Comment