
అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ (68) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. దేశంలో అణుశక్తి అభివృద్ధి శేఖర్ బసు ఎంతగానో కృషిచేశారు. దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఏఎస్ అరిహంత్ రూపకల్పనలో శేఖర్ బసు ప్రముఖ పాత్ర పోషించారు. భారత అణుశక్తి కార్యక్రమంలో నాలుగు దశాబ్దాలపాటు సేవలు అందించారు. శుద్దిచేసిన యురేనియం ఉపయోగించి 100 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన అణు రియాక్టర్ ద్వారా జలాంతర్గామి పనిచేసేలా రూపొందించడంలో శేఖర్ బసు పాత్రే కీలకం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రెటరీగానూ, బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ అణ్వాయుధ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక, 2015లో భారత అణుశక్తి ప్రోగ్రామ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో 2018 అక్టోబరు వరకు కొనసాగారు. 1952 సెప్టెంబరు 20 బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జన్మించిన శేఖర్ బసు.. ముంబయి యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kIP6fL
No comments:
Post a Comment