Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 24 September 2020

ఢిల్లీ అల్లర్ల ఛార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ నేత సుల్మాన్ ఖుర్షీద్ పేరు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)కి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు.. హింసాత్మకంగా మారి 53 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలుచేసిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా, ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత పేరును చేర్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు ఖుర్షీద్ పేరును చేర్చినట్లు వివరించారు. ‘ఉమర్ ఖలీద్, సల్మాన్ ఖుర్షీద్, నదీమ్ ఖాన్... వీరందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ప్రజలు గుమిగూడారు’ అని 17,000 పేజీల ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే రెచ్చగొట్టే క్రమంలో ఎటువంటి ప్రసంగం చేశారన్న కచ్చితమైన సమాచారాన్ని మాత్రం పోలీసులు తెలకపోవడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయడంతో మరింత చట్టబద్ధత చేకూరినటయ్యింది. ఇదిలా ఉండగా.. ఛార్జ్‌షీట్‌లో తన పేరును చేర్చడంపై సల్మాన్ ఖుర్షీద్ ఘాటుగా స్పందించారు. ‘మీరు చెత్తను సేకరిస్తే చాలా మలినాలే వస్తాయి.. ఆ చెత్తను ఎవరికైనా ఆపాదించవచ్చు. రెచ్చగొట్టే ప్రసంగాలంటే ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నా’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నేనమన్నా జోలపాట పాడేందుకు ఆ సమావేశానికి హాజరయ్యానా? ఓ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన కారణానికి హాజరయ్యానా? ఆలోచించండన్నారు. ‘నేను రెచ్చగొట్టే ప్రకటనలు చేశానని చెప్పి (సాక్షి) అబద్దం చెప్పలేదు.. పోలీసులు స్టేట్‌మెంట్ మీద చర్య తీసుకున్నారా? వారు దానిపై చర్య తీసుకోకపోతే దాని విలువ ఏమిటి ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. చెత్తను సేకరించకండి.. కానీ, చెత్త నాణ్యతపై ప్రశ్నలు వేయకండి అంటూ ఖుర్షీద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అల్లర్ల ఛార్జీ‌షీట్‌లో కీలక రాజకీయ నేత పేరును చేర్చడం ఇదే తొలిసారి. గతంలో సీపీఎం నేత సీతారం ఏచూరి పేరున్నట్టు ప్రచారం జరిగినా ఢిల్లీ పోలీసులు దీనిని ఖండించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3661KkW

No comments:

Post a Comment