Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 September 2020

హైదరాాబాద్‌లో దారుణం.. ఒకర్ని చంపబోయి మరొకరి హత్య

బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వాదియే ముస్తఫా అనే ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడిపై కొందరు దాడి చేసి దారుణంగా హతమార్చారు. అతడు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. బాలాపూర్‌ పోలీసుల కథనం ప్రకారం.. వాదియే ముస్తఫాకు చెందిన సయ్యద్‌ మోమీన్‌ అలీ(24) మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై మార్గం మధ్యలో నలుగురు కత్తులతో దాడికి దిగారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే యువకుడి హత్యలో ఓ ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులు ఫరాన్ చంపబోయి మరో యువకుడు అయిన మోమిన్ అలీని హత్య చేసినట్లు తెలిసింది. షాహిన్‌నగర్‌ వాది ఎ ముస్తఫాలో ఉండే షాహిన్‌ సయ్యద్‌ మోమిన్‌ అలి(24).. మంగళవారం రాత్రి తన మిత్రుడు ఫరాన్‌ ఇంట్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున ఆకలిగా ఉందని.. తినడానికి ఏమైనా తేవాలంటూ ఫరాన్‌.. తన బైక్ ఇచ్చి మోమిన్‌ అలి, మరో మిత్రుడు ఖాలెద్‌ను పంపించాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా.. నలుగురు యువకులు వాహనంపై వచ్చి చీకట్లో మోమిన్‌ అలిని కడుపులో కత్తులతో పొడిచారు. Read More: అయితే ఈ ఘటనతో భయపడ్డ ఖాలెద్‌.. బండి దిగి పరారయ్యాడు. నిందితులు వచ్చిన వాహనంపైనే వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికి మోమిన్‌ అలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మోమిన్‌ అలి మృతిచెందాడు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌లు సంఘటనా స్థలిని పరిశీలించారు. హత్యకు గురైన యువకుడు అమాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. మోమిన్‌ అలిని పంపించిన ఫరాన్‌.. పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో ఉంటున్నాడు. సబ్బుల ఫ్యాక్టరీ ఉందని ఫరాన్‌ కొందరిని నమ్మించి రూ.18లక్షలు వసూలు చేసినట్లు పహాడీషరీఫ్‌ ఠాణాలో నమోదైవుంది .దీంతో అలిని కాకుండా ఫరాన్‌ను హతమార్చాలని నిందితులు పథకం వేశారు. ఆ వాహనం ఫరాన్‌ది కావడం, చీకటిలో మనిషిని గుర్తించలేకపోవడంతో అమాయకుడైన అలీని బలితీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33XvMoa

No comments:

Post a Comment