
ప్రముఖ వ్యాపారవేత్తని కత్తులతో పొడిచేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని నిడదవోలుకి చెందిన వ్యాపారవేత్త, 28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సత్తి వేణుమాధవ్ రెడ్డిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడికి తెగబడ్డారు. మండలంలోని సమిశ్రగూడెంలో ఈ ఘటన జరిగింది. అనంత లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వ్యవహారంలో కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాధవరెడ్డిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ కుటుంబ సభ్యులే చేయించినట్లు అనుమానిస్తున్నారు. కత్తులతో నరికి కొనప్రాణంతో ఉన్న మాధవ రెడ్డిని ప్రత్యర్థులే ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక శేషగిరి ఆసుపత్రిలో మాధవ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న చవ్వ శ్రీధర్‌ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సత్య కృష్ణ, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cpIzE1
No comments:
Post a Comment